- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్:దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా భారత్-చైనా మధ్య విమాన సర్వీసులను పునఃప్రారంభించనుంది. 2026 ఫిబ్రవరిలో దిల్లీ-షాంఘై మార్గంలో సర్వీసు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముంబయి-షాంఘై కొత్త మార్గంలో కూడా కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. ఈ సర్వీసులు రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, వైద్య, విద్యా, సాంస్కృతిక రంగాల్లో అవకాశాలను మెరుగుపరుస్తాయని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -


