Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంమళ్ళీ ఆగిపోయిన ఎయిరిండియా..

మళ్ళీ ఆగిపోయిన ఎయిరిండియా..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం (ఏఐ103) ఆస్ట్రియా రాజధాని వియన్నాలో నిలిచిపోయింది. ఇంధనం నింపుకోవడానికి అక్కడ ఆగిన విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రయాణాన్ని రద్దు చేశారు. నిన్న ఢిల్లీలో బయలుదేరిన ఈ విమానం ప్రణాళిక ప్రకారమే వియన్నాలో ఆగింది. అయితే, సాధారణ తనిఖీల సమయంలో విమానంలో ఒక ముఖ్యమైన నిర్వహణ సమస్యను సిబ్బంది గుర్తించారు.

దాన్ని సరిచేయడానికి అదనపు సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రయాణాన్ని రద్దు చేసినట్టు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. దీంతో ప్రయాణికులను విమానం నుంచి దించివేసి, వారికి ప్రత్యామ్నాయ విమానాల్లో ఏర్పాట్లు చేయడం లేదా టిక్కెట్ డబ్బులు పూర్తిగా వాపసు ఇవ్వడం వంటివి చేసినట్టు చెప్పారు. ఈ కారణంగా, వాషింగ్టన్ నుంచి ఢిల్లీ రావాల్సిన ఏఐ 104 విమానాన్ని కూడా రద్దు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad