Wednesday, July 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌ జైలుపై వైమానిక దాడి

ఉక్రెయిన్‌ జైలుపై వైమానిక దాడి

- Advertisement -

17మంది ఖైదీలు మృతి, 80 మందికి పైగా గాయాలు
కీవ్‌ :
ఉక్రెయిన్‌లోని ఈశాన్య జపోరిజిజియా ప్రాంతంలోని జైలుపై రష్యా జరిపిన వైమానిక దాడిలో 17మంది ఖైదీలు మరణించారు. 80మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్‌ అధికారులు మంగళవారం తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన 42మంది ఖైదీలను ఆస్పత్రిలో చేర్చారు. మరో 40మంది వివిధ రకాలుగా గాయపడ్డారు. దాడి కారణంగా జైల్లోని డైనింగ్‌ హాల్‌ మొత్తంగా ధ్వంసమైంది అలాగే అడ్మినిస్ట్రేటివ్‌, క్వారంటైన్‌ భవనాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే బయట రక్షణ కంచె దెబ్బతినలేదని, అందువల్ల ఖైదీలెవరూ తప్పించుకు పారిపోలేదని అధికారులు చెప్పారు.డ్నిప్రో ప్రాంతంలో జరిగిన దాడిలో నలుగురు మరణించగా, 8మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. ఈ దాడిలో కామియాన్స్కే నగరంపై క్షిపణులు ప్రయోగించారు. మెటర్నిటీ ఆస్పత్రి, సిటీ హాస్పిటల్‌ వార్డులతో సహా మూడంతస్తుల భవనం పాక్షికంగా దెబ్బతింది. దాడులకు రెండు బాలిస్టిక్‌ క్షిపణులను, 37 డ్రోన్లను, యుఎవిలను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్‌ వైమానిక దళం తెలిపింది. వీటిలో 32 డ్రోన్లను ఉక్రెయిన్‌ బలగాలు అడ్డుకున్నాయని వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -