Saturday, August 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జాతీయ నూతన కార్యవర్గం ఎన్నిక

ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జాతీయ నూతన కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌) నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆర్‌ కరుమలయన్‌, జీవన్‌సాహు (పశ్చిమబెంగాల్‌) ఎన్నికయ్యారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కే హరికృష్ణ (కేరళ), కోశాధికారిగా కేఎస్‌ సునీల్‌ (కేరళ) ఎన్నికయ్యారు. మూడురోజులపాటు కేరళలోని తిరువనంతపురంలో జరిగిన 12వ జాతీయ మహాసభలు గురువారంతో ముగిసాయి. అంతకుముందు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆఫీస్‌ బేరర్స్‌గా 35 మంది ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి పీ శ్రీకాంత్‌ జాతీయ ఉపాధ్యక్షులుగా, వీఎస్‌ రావు జాతీయ కార్యదర్శిగా ఎన్నికయారు. 350 మందితో జనరల్‌ కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు. వారిలో తెలంగాణ నుంచి తొమ్మిదిమంది ఎన్నికయ్యారు. ఒకర్ని కో ఆప్షన్‌ సభ్యులుగా చేర్చుకుంటారు. తెలంగాణ నుంచి జనరల్‌ కౌన్సిల్‌కు ఎన్నికైన వారిలో వై. విక్రమ్‌ (ఖమ్మం), జి. ఉపేందర్‌ (ఖమ్మం), ఎస్‌. విజేందర్‌ (జనగామ), కె. అజరుబాబు (హైదరాబాద్‌ సెంట్రల్‌), ఐ. రమేష్‌ (మేడ్చల్‌), ఎల్‌. కోటయ్య (హైదరాబాద్‌ సౌత్‌), వీరాంజనేయులు(ఆర్టీసీ), పి. రవీందర్‌రెడ్డి (ఆర్టీసీ), పి సుధాకర్‌, (ఆర్టీసీ- ఖమ్మం) ఉన్నారు. మొత్తం 140 మంది వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. వారిలో తెలంగాణ నుంచి నలుగురు వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నికయారు. ఫెడరేషన్‌ నాయకత్వ బాధ్యతలకు ఎన్నికైనవారికి టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ అభినందనలు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -