నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు బిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎ ఐ ఎస్ ఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 8 వేల కోట్ల స్కాలర్షిప్ లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలోని సమస్యలు పరిష్కారం కు నోచుకోవడం లేదని వారు పేర్కొన్నారు. కొద్దిరోజుల ముందు కళాశాలల యాజమాన్యాలతో చర్చించి పెండింగ్ బకాయిలను విడుదల చేస్తామని తెలిపిన ఇప్పటి వరకు విడుదల చేసిన దాఖలాలు లేవని వెంటనే పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని లేని పక్షం లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ఏఐఎస్ఎఫ్ బిక్షాటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



