- Advertisement -
న్యూఢిల్లీ : ఇన్సూరెన్‌్‌స రెగ్యూలేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏఐ) నూతన చైర్మెన్‌గా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అజయ్ సేథ్ నియమితులయ్యారు. 1987 బ్యాచ్ కర్నాటక క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన అజరు సేథ్‌కు ఈ బాధ్యతలను అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక సేవల విభాగంలో సేథ్ నాలుగేండ్లు కార్యదర్శిగా పని చేశారు. ఈ ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేశారు. మూడేండ్ల పాటు ఐఆర్‌డీఏఐ చైర్మెన్ పదవిలో కొనసాగుతారు. దేవాశిష్ పాండా పదవీకాలం నాలుగు నెలల క్రితమే ముగియగా.. అప్పటి నుంచి ఇది ఖాళీగా ఉంది.
- Advertisement -