Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్బాసర ఆలయ స్పేషల్ ఆఫీసర్ గా అజ్మీరా సంకేత్ కుమార్...

బాసర ఆలయ స్పేషల్ ఆఫీసర్ గా అజ్మీరా సంకేత్ కుమార్…

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జ్ఞాన సరస్వతి దేవస్థానము స్పెషల్ ఆఫీసర్ గా  అజ్మీరా సంకేత్ కుమార్ ను నియమిస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. గతం నుండి ఆలయ ఇంచార్జి ఈఓ గా కీసర గుట్ట ఈఓ సుధాకర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఇంచార్జి పాలనతో ఆలయం పర్యవేక్షణ లోపం అభివృద్ధి పై ప్రభావం పడింది. పాలన కుడా గాడి తప్పిందన్న విమర్శలు లేకపోలేదు.దీంతో ఆలయ అభివృద్ధికి  కోసం స్పెషల్ ఆఫీసర్ గా  ఐఎఎస్ అధికారిని  నియమించాలన్న ప్రతిపాదన చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండేది. జిల్లా కలెక్టర్ ఈ విషయం లో చొరవ చూపి ఆలయ అభివృద్ధి కోసం భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ ను బాసర ఆలయ స్పెషల్ ఆఫీసర్ గా  నియమించారు. దీంతో బాసర ఆలయం అభివృద్ధి పారదర్శకంతో పాటు, ఆలయ ఉద్యోగుల విధి నిర్వహణ పై నిఘాతో పాటు భక్తులు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటారన్న ,అభిప్రాయంస్థానికులు, భక్తులు ,వ్యక్తం చేశారు . స్పెషల్ ఆఫీసర్ నియామకం పై హర్షం వ్యక్తం అవుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad