Tuesday, December 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅంచనాలకు మించి 'అఖండ 2'

అంచనాలకు మించి ‘అఖండ 2’

- Advertisement -

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కొలాబరేషన్‌లో వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. 2డి, 3డి రెండు ఫార్మాట్లలో ఈనెల 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

  • బాలయ్యతో మళ్ళీ వర్క్‌ చేయడం చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. బాలయ్య, బోయపాటిది బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్‌. వరసగా హ్యాట్రిక్‌ విజయాల తర్వాత మళ్లీ వస్తున్న సినిమా ఇది. ఈ కథ చాలా బిగ్‌ స్పాన్‌ ఉన్నది. బాలయ్యలో అప్పటికీ ఇప్పటికీ అదే ఎనర్జీ. ఇంకా పెరిగింది. ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన ఎనర్జీ మనకి వస్తుంది.
  • ఈ సినిమాని కుంభమేళాలో చిత్రీకరణ చేసాం. అక్కడ చిత్రీకరణ చేయాలంటే చాలా పర్మిషన్స్‌ కావాలి. మాకు అన్ని పర్మిషన్లు దొరికాయి. డ్రోన్‌ పర్మిషన్‌ కూడా దొరికింది. ఇప్పుడు మీరు సినిమాలో చూడబోయే ప్రతి సన్నివేశం ఈ సినిమా కోసం తీసిందే. స్టాక్‌ షాట్స్‌ని ఉపయోగించలేదు. బోయపాటి అహర్నిశలు కష్టపడి కుంభమేళా సన్నివేశాలని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు.
    -ప్రీమియర్స్‌ వేసే ఆలోచనలో ఉన్నాం. పర్మిషన్స్‌ కోసం లెటర్స్‌ పెట్టాం. అనుమతులు రాగానే ప్రీమియర్‌ డేట్స్‌ అనౌన్స్‌ చేస్తాం. నాలుగో తేదీ సాయంత్రం ఎనిమిది, తొమ్మిది గంటల నుంచి ఉండొచ్చు. ఈ సినిమాకి టికెట్‌ రేట్స్‌ రీజనబుల్‌ గానే పెడుతున్నాం.
  • ఈ సినిమాని మొదటనుంచి పాన్‌ ఇండియా రిలీజ్‌ చేయాలని అనుకున్నాం. అయితే పాన్‌ ఇండియా కోసమంటూ ప్రత్యేకంగా కథలో చేసిన మార్పులంటూ ఏమీ లేవు. ఇది పాన్‌ ఇండియా కంటెంట్‌. ఈ సినిమా కథ గ్లోబల్‌గా అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. సినిమాల్లో చాలా గూజ్‌ బంప్స్‌ మూమెంట్స్‌ ఉంటాయి. బాలయ్య, బోయపాటి నుంచి ఏమి ఆశిస్తారో అంతకుమించి ఉంటుంది. సినిమా చూశాం. అదిరిపోయింది. ఈ సినిమా కథ వినగానే త్రీడీలో బాగుంటుందనుకున్నాం. రేపు త్రీడీ సెన్సార్‌ ఉంటుంది. 2డి, 3డి రెండూ ఒకేసారి రిలీజ్‌ ఉంటుంది.
  • తేజస్విని ప్రమోషన్‌కి సంబంధించి మంచి సజెషన్స్‌ ఇస్తుంటారు. అలాగే ప్రొడక్షన్‌లో కూడా యాక్టివ్‌గా పార్టిసిపేషన్‌ చేయాలని అనుకుంటున్నారు. అది ఈ సినిమాతో మొదలు పెడితే బాగుంటుందని భావించారు.
  • అఖండతో పోలిస్తే ఈ చిత్రానికి యాక్షన్‌ డోస్‌ పెరిగిందనే వాస్తవం. ఎందుకంటే శివుడంటే మాస్‌ కదా.. శివతాండవం ఎంత శక్తివంతంగా ఉంటుందో, ఇందులో యాక్షన్‌ కూడా అలానే ఉంటుంది. ఇందులో త్రిశూలం వాడినట్లుగా మరో సినిమాలో వాడలేదు.
  • ఈ సినిమా క్లైమాక్స్‌ అంతా జార్జియాలో చేశాం. నిజానికి కాశ్మీర్లో చేయాల్సింది కానీ అదే సమయంలో పెహెల్గాం దాడి జరగడంతో పర్మిషన్స్‌ సమస్య వచ్చింది. సంయుక్తది హీరోయిన్‌ క్యారెక్టర్‌లా కాకుండా ఈ కథలో ఒక ముఖ్యమైన పాత్రలానే వుంటుంది. ‘అఖండ’లో ఉన్న పూర్ణ ఇందులో కూడా కంటిన్యూ అవుతారు.
  • ఇందులో సనాతన ధర్మం ఉంటుంది. దానితోపాటు నమ్మకం, భక్తి మీద నడిచే కథ ఇది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ట్రైలర్‌ చూసి చాలా బాగుంది అన్నారు. అద్భుతమైన కంటెంట్‌ అని అభినందించారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -