రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చ
ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ సుబ్రమణియన్‌తోనూ సమావేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డితో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల సీఎం నివాసంలో వీరిరువురూ సమావేశమయ్యారు. వివిధ రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అఖిలేశ్‌కు రేవంత్‌రెడ్డి వివరించారు. యాదవ్‌లకు ఎంతో ఇష్టమైన సదర్ ను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తిస్తు సీఎం నిర్ణయం తీసుకోవడాన్ని అఖిలేశ్ ప్రశంసించారు. దేశంలోని యాదవ సమాజం రేవంత్‌రెడ్డిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. తమ సామాజిక వర్గానికి రాజకీయంగా గుర్తింపు ఇస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
సుబ్రమణియన్ భేటీ
ప్రముఖ ఆర్థికవేత్త, భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కూడా సీఎంను కలిశారు. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడం, తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తీర్చి దిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు.
సీఎం రేవంత్‌రెడ్డితో అఖిలేశ్‌యాదవ్ భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



