- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాను శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో సస్పెండ్ చేశారు. ఈ చర్యపై సమాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దేశంలోనే మూడవ అతిపెద్ద పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేత పేజీని సస్పెండ్ చేయడం ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తుందని అంది. అఖిలేశ్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాకు 80 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
- Advertisement -