- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అల్-ఖైదా ఇండియన్ సబ్ కంటినెంట్ (AQIS) ఉగ్రవాద మాడ్యూల్‌కు సంబంధించిన ప్రధాన కుట్రదారుని గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్ట్ చేసింది. 30 ఏళ్ల షమా పర్వీన్‌గా గుర్తించిన నిందితురాలిని కర్ణాటకలోని బెంగళూరులో అరెస్ట్ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. షమా పర్వీన్ ఈ మాడ్యూల్‌ను నడిపిస్తూ, కర్ణాటక నుంచి కార్యకలాపాలను సమన్వయం చేస్తున్న ప్రధాన హ్యాండ్లర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అరెస్ట్‌కు ముందు, జులై 23న గుజరాత్, ఢిల్లీ, నోయిడాలో 20 నుంచి 25 ఏళ్ల వయస్సు గల నలుగురు ఉగ్రవాద అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -