Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeఆటలుసెమీస్‌కు అల్కరాజ్‌, గాఫ్‌

సెమీస్‌కు అల్కరాజ్‌, గాఫ్‌

- Advertisement -

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ
పారిస్‌:
ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సెమీఫైనల్లోకి స్పెయిన్‌ యువ సంచలనం, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌తోపాటు, అమెరికా సంచలన క్రీడాకారిణి కోకా గాఫ్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో 2వ సీడ్‌ వరుససెట్లలో 12వ సీడ్‌, అమెరికాకు చెందిన టామీ పాల్‌ను చిత్తుచేశారు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్‌ 6-0, 6-1, 6-4తో టామీ పాల్‌పై విజయం సాధించాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో అల్కరాజ్‌ 8వ సీడ్‌, ఇటలీకి చెందిన మసెట్టితో తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో 2వ సీడ్‌, అమెరికాకు చెందిన కోకా గాఫ్‌ మూడు సెట్ల హోరాహోరీ పోరులో సహచర క్రీడాకారిణి మాడీసన్‌ కీస్‌పై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో గాఫ్‌ 6-7(6-8), 6-4, 6-1తో కీస్‌ను చిత్తుచేసింది. టాప్‌సీడ్‌ జెన్నిక్‌ సిన్నర్‌(ఇటలీ), కజకిస్తాన్‌కు చెందిన బబ్లిక్‌, జర్మనీకి చెందిన 3వ సీడ్‌ జ్వెరేవ్‌, 6వ సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ల మధ్య ఇతర క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Advertisement
Advertisement
Ad