ప్రజల ఆరోగ్య, సంక్షేమాభివృద్ధికి రాష్ట్ర మద్యం విధానం అత్యంత ప్రమాదకరంగా మారుతున్నది. దేశంలో నెలరోజుల క్రితం జరిగిన సర్వేలో మద్యా నికి బానిసలైనవారు తెలంగాణలో 65శాతం ఉన్నట్లు, దేశంలోనే ఇది ప్రథమ స్థానమని తేలింది. ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి విధానం రూపొందించుతున్నదే తప్ప ప్రజల ఆరోగ్య పరి స్థితులను, వారి సంక్షేమ స్థితిగతులను గమ నంలోకి తీసుకోవడం లేదు. పద్దెనిమిదేండ్ల వయస్సు దాటనివారు మద్యానికి బానిసల వుతున్న దుర్భరమైన స్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇది సంక్షేమ ప్రభుత్వం అనిపించుకుంటుందా? ప్రతియేటా మద్యం ద్వారా సర్కార్‌కు రూ. 40వేల కోట్ల ఆదాయం వస్తున్నది. ఇందులో రూ.27,623 కోట్లు దుకాణపు పన్ను కాగా రూ14 వేల కోట్లు అమ్మకపు పన్ను. ఈ మధ్య లీటర్‌కు రూ.40 పెంచగా, ఇది మరో రూ. 4500 ఆదాయం రాబడుతున్నది. ఇందులోనే వ్యాట్‌ట్యాక్స్ రూ. 19,176 కోట్లు ఉన్నది. ఈ విధంగా మద్యం ధరలు, అడ్డాపన్ను, వాణిజ్య పన్ను పెంచడం ద్వారా వేలకోట్ల ఆదాయాన్ని సంపా దిస్తున్నది. ప్రస్తుతం రూ.40వేల కోట్లు అనగా మొత్తం బడ్జెట్‌లో (3.04 లక్షల కోట్లు) 12శాతం రాబడి సమకూరుతున్నది.
రాష్ట్రంలో 2,620 లైసెన్స్ షాపులు ఉన్నాయి. వీటిలో 15 శాతం గౌడ కుల స్తులకు, పది శాతం దళితులకు, ఐదు శాతం గిరిజనులకు మొత్తం 786 దుకాణాలను రిజర్వ్ చేశారు. ఆ కులస్తులను కూడా మద్యానికి అలవాటు పడే విధంగా రిజ ర్వేషన్‌లు కొనసాగిస్తున్నారు. 19మే 2025 నుండి స్పెషల్ ఎక్సైజ్ పన్ను ్లప్రతి నెలా రూ.500 కోట్లు వచ్చేలా పెంచారు. క్వార్టర్‌పై పదిశాతం ఎక్సైజ్ సుంకం విధించారు. మద్యం షాపుల వేలం దేశంలో ఎక్కడాలేని విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతున్నది. వేలంలో పాల్గొనేవారు. రూ.2 లక్షలు డిపాజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతానికి మొత్తం లక్షా30వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వానికి రూ.2,600 కోట్లు ఆదాయం వస్తున్నది. లక్కీడ్రాలో వచ్చిన వారికే దుకాణం ఇస్తారు. రాణివారి డిపాజిట్‌ను ప్రభుత్వమే తీసుకుంటున్నది. ఈ విధంగా వేలం పాటల మీదనే వేల కోట్ల ఆదాయం రాగా ఎక్సైజ్ పన్నులు, మద్యం ధర పెంచడం ద్వారా కూడా విపరీతమైన రాబడి వస్తున్నది. దీన్ని వీలైనంత ఎక్కువ రాబట్టడానికి ఎక్సైజ్ శాఖకు తమదైన శైలిలో మార్గదర్శకాలు జారీచేసింది! అందు కనుగుణంగా ప్రతి లైసెన్స్ షాపు చుట్టుపక్కల గ్రామాల్లో 10 నుంచి15 బెల్ట్‌షాపులు ఏర్పాటు చేస్తున్నది.
తనకు కేటాయించిన ఏరియాలో ఈ షాపుల నుండి డిపా జిట్లు తీసుకుని, వాటితో లైసెన్స్ దుకాణ యాజ మాన్యాలు వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి.
మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానంలో ఉన్నాయి. జనగాంలో 60.6 శాతం, భువనగిరిలో 58.4, మహబూబాబాద్‌లో 56.5, మద్యం ఎక్కు వగా అమ్ముడవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అంటే పేద,మధ్య తరగతి ప్రజలు దీనిపై ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టే లెక్క! మద్యంతోపాటు డ్రగ్స్, గంజాయి, కల్తీకల్లు కూడా విస్తార మైంది. ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో మద్యంషాపుల్ని ఏర్పాటు చేసింది
. 2011 జనాభా లెక్కల ప్రకారం దుకాణాల్ని ఏర్పాటు చేసి వాటికి ”అడ్డాపన్ను” నిర్ణయించింది. మద్యం ఎంత అమ్ముకున్నా ఈ నిర్ణీతమొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి.
1985లో ప్రజాందోళన ఫలితంగా నాటి ఎన్టీ రామారావు సర్కార్ మద్యం నిషేధాన్ని రాష్ట్రంలో అమలు చేసింది. ఆ తర్వాత చంద్రబాబు మరల మద్యం అమ్మ కాలు సాగించింది. నేడు మారుమూల ప్రాంతాలకు కూడా మద్యం విస్తరించింది. దాన్నే ప్రభుత్వం ఇప్పుడు ఆదాయ వనరుగా మార్చుకుంది. కానీ, బీహార్, గుజరాత్, మిజోరం, నాగాలాండ్, లక్ష ద్వీప్ రాష్ట్రాల్లో మద్యం నిషేదాన్ని అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. రాజ్యా ంగం ఆర్టికల్ 47 ప్రకారం మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. ప్రజా సంక్షేమాన్ని కోరే విధంగా నియంత్రణను పాటించాలి.
రాష్ట్రంలో విద్యావైద్య రంగాల్లో చాలా వెనకబడి ఉన్నాము. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి 64శాతం నుండి 68 శాతానికి మాత్రమే అక్షరాస్యత పెరిగింది. 70 సంవత్సరాల తర్వాత నిరక్షరాస్యులు 32శాతం ఉండటం మన వెనకబాటుతనాన్ని ఎత్తిచూపుతున్నది. విద్యారంగానికి బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం 23వేల కోట్లు కేటాయించింది. అంటే 7.5శాతం. అదే కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపురలో అప్పటి వామపక్ష ప్రభుత్వాలు అక్షరాస్యతను 96 శాతానికి పెంచాయి. రాష్ట్రంలో వైద్యరంగానికి కేటాయించింది రూ.11,737కోట్లు. అంటే బడ్జెట్‌లో 3.8శాతం. ఈరెండు రంగాల కేటాయింపు మద్యంపై వచ్చే ఆదాయానికి తక్కువగానే ఉంది. రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు కావడానికి విద్యా, ఆరోగ్యం అత్యంత కీలకం. దీంతో పాటు ఆవాస గృహాలు, తాగునీరు, రహదారులు తదితర మౌలిక వసతులు చాలా అవసరం. కానీ, ఈ మౌలిక వసతులకు బడ్జెట్ల కేటాయింపుల్లో 30శాతం వరకు కోత పెడుతుండటం శోచనీయం. విద్యా, వైద్యం రంగంతో పాటు తాగునీరు, విద్యుత్‌కు నోచని కుటుం బాలు రాష్ట్రంలో 18శాతం ఉన్నాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేశామని, ఇందుకు 45వేల కోట్లు వ్యయం చేశామని ప్రభుత్వం ప్రకటించింది. 18శాతం గ్రామా లకు తాగునీరు రాకున్నా మద్యం మాత్రం ఏరులై పారుతున్నది.
పైగా పక్కరాష్ట్రాల్లో మద్యం ధర తక్కువున్నప్పుడు బడా వ్యాపారులు తెలంగాణకు అడ్డదారిలో ఎగుమతులు చేస్తున్నారు. అంతేకాదు, తమ వేలం పాట పాడే ప్రాంతాల్లో ఇతరులు మద్యం అమ్మకుండా రౌడీలను పెట్టి దాడులు చేయిస్తున్నారు. పేద, దళిత, గిరిజన, వెనకబడిన తరగతుల వారిపై కూడా మద్యం కాంట్రాక్టర్లు బెదిరింపులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ గుండాలకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ అండగా ఉన్నట్టు బాధితులు వాపోతున్నారు.
మద్యానికి అలవాటు పడినవారు మంద బుద్ధి బారిన పడుతారు. సమాజానికి ఏమాత్రం సహకరించరు. అందువల్ల రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించాలని మహిళలు కోరు తున్నారు. 18 ఏండ్ల లోపు యువత ఆరోగ్యంగాను, విద్యా వంతులు గాను అభివృద్ధిలోకి రావాలి. అందుకు తగిన విధంగా ప్రభుత్వ విధానాలు రూపొందించాలి. ఒక వైపున తలసరి ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వం, దేశంలో అగ్రగామిగా రూ.3 లక్షలకు పైన ఆదాయం ఉన్నట్లు ప్రకటించింది. కానీ, అదే సందర్భంలో దారిద్య్రరేఖకు దిగువన సంఖ్య కూడా 37శాతానికి పెరిగినట్లు గణాంకాల్ని పరిశీలిస్తే తెలుస్తోంది. ఎవరో కొద్ది మంది సంపదలో సగటున లెక్కలేసి ఈ గణాంకాలు ప్రకటి స్తున్నట్టు అర్థమవుతోంది. దారిద్య్ర నిర్మూలనకు మద్యం నియ ంత్రణ మొదటి మెట్టు, దాన్ని సర్కార్ ముందు గుర్తించాలి. దీనికి తోడు డ్రగ్స్, కల్లు, గంజాయి, నల్లమందు తదితర ఉత్పత్తులను నిషేదించాలి.
తెలంగాణ ప్రభుత్వం ”డ్రగ్స్‌లేని రాష్ట్రంగా” తయారు చేస్తా రని 2023 డిసెంబర్ నుంచి ప్రకటిస్తూ వస్తున్నది.ఇందుకు ప్రత్యేకమైన సిబ్బందిని కూడా నియమించింది. అయినా, విద్యా లయాల్లో, దవాఖానాల్లో, ఇతర పబ్లిక్ స్థలాల్లో విసృతంగా అమ్మ కాలు సాగుతున్నాయి. దీంతో నేడు యాభై శాతం ప్రజల ఆరోగ్య పరిస్థితి ఆధ్వానంగా మారింది. ఆ కుటుంబాలు వైద్య ఖర్చులు భరించలేని విధంగా తయారైంది. వాస్తవాలను గుర్తించి కాం గ్రెస్ ప్రభుత్వం మద్యం, దాని అనుబంధ ఉత్పత్తు లను నియం త్రించాలి. అలాగే ప్రజల చైతన్యాన్ని పెంచడానికి కూడా కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఆదాయం రాబ ట్టుకోవాలి తప్ప దీన్నే ఆదాయ వనరుగా చూడకూడదు. మద్యం ఆదాయం పెరగడమంటే తగ్గుతున్న ప్రజల జీవన ప్రమాణాల స్థాయికి సంకేతంగా, ప్రమాద సూచికగా భావించాలి.
గ్యార శివకుమార్
9951227356