Thursday, July 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరూ.21 లక్షల మద్యం ధ్వంసం

రూ.21 లక్షల మద్యం ధ్వంసం

- Advertisement -

– రోడ్డు రోలర్‌తో తొక్కించిన పోలీసులు
నవతెలంగాణ-చింతలమానేపల్లి

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. కుమురంభీం- ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి గూడెం గ్రామ శివారులో అప్పట్లో పోలీసులు దాడులు చేసి పెద్దమొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఆదిలాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు బుధవారం ఆసిఫాబాద్‌ ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ జ్యోతి కిరణ్‌, రెవెన్యూ శాఖ అధికారులు ఇన్‌చార్జి తహసీల్దార్‌ మడవి డౌవులత్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ జాఫర్‌ పంచు ధ్వంసం చేశారు. రూ.21లక్షల 50వేల 890 మద్యాన్ని రోడ్డు రోలర్‌తో తొక్కించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -