Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఅందరి చూపూ అలస్కా వైపు

అందరి చూపూ అలస్కా వైపు

- Advertisement -

– ట్రంప్‌-పుతిన్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ
– కొన్ని గంటల్లో అమెరికా, రష్యా అధ్యక్షుల చర్చలు
– సమావేశం పైనే భారత్‌పై సుంకాల పెంపు, ఉక్రెయిన్‌-రష్యా
యుద్ధం భవితవ్యం
అలస్కా :
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య సమావేశం అంతర్జాతీయంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. అలస్కా వేదికగా వీరిద్దరి మధ్య శుక్రవారం ఈ భేటీ జరగనున్నది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కానున్నారు. ఇందుకు కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ట్రంప్‌.. ఎలక్షన్‌ క్యాంపెయిన్‌లో పెద్ద హామీలనే ఇచ్చారు. అమెరికాను మరోసారి గొప్పదేశంగా తీర్చి దిద్దుతాననీ, ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధాలను ఆపుతానని ట్రంప్‌ తన ఎన్నికల ప్రసంగాల్లో చెప్పారు. యుద్ధాలు ఆపటం తనకు చాలా తేలిక అని అన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం గురించి ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ ఏడాది జనవరిలో అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ట్రంప్‌ మాత్రం ఆ వైపుగా చర్యలు తీసుకోవటంలో మాత్రం ఏ మాత్రమూ విజయం సాధించలేదు. పుతిన్‌తో తనకు మంచి సంబంధాలున్నాయంటూ పలు సందర్భాల్లో ట్రంప్‌ చెప్తుంటాడు. ఈ నేపథ్యంలో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌.. తొలిసారి పుతిన్‌తో సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అయితే తాము లేకుండా యుద్ధం ముగింపు చర్చకు తావు లేదని ఉక్రెయిన్‌ అంటున్నది. ఇక ఇదే రష్యా నుంచి చమురు కొంటున్నదనే సాకుతో అమెరికా.. భారత్‌పై టారిఫ్‌ దాడికి దిగింది. సుంకాలను రెండు దశల్లో 50 శాతానికి పెంచింది. మొదటి దశలో భాగంగా 25 శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఈ నెల చివరన మరో 25 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. అయితే ఈ సుంకాల పెంపుదల, ఇతర ఆంక్షల విధింపు అనేది ట్రంప్‌, పుతిన్‌ల మధ్య జరిగే సమావేశంపై ఆధారపడి ఉంటుందని అమెరికా చెప్తున్నది. వీరిద్దరి మధ్య చర్చలు విఫలమైతే.. భారత్‌పై సుంకాల బాధుడు తప్పదని ఇప్పటికే అమెరికా హెచ్చరికలు పంపింది. కాబట్టి భారత్‌పై అమెరికా సుంకాల విధింపు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం భవితవ్యం తేలాలంటే అలస్కా వేదికగా ట్రంప్‌, పుతిన్‌ల సమావేశం నిర్ణయించనున్నది విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad