Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రైతులంతా సంఘటితము కావాలి..

రైతులంతా సంఘటితము కావాలి..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్
గల్రైతులంతా ఒక సంఘటితం అయ్యి రైతుల సమస్యల పరిష్కారం కోసం పని చేయడమే భారతీయ కిసాన్ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పైడి విట్టల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రోజున మండల కేంద్రంలో బాలరాముని జయంతి సందర్బంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. లాభసాటి ధర కోసమే భారతీయ కిసాన్ సంఘం పని పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశంలోఅతి దయనీయ స్థితిలో ఉన్న ఏకైక రంగం వ్యవసాయ రంగమని, రైతును రాజు చేయడం కోసమేపని చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో అన్ని గ్రామాల్లో కిసాన్ సంఘం కమిటీలు పూర్తి చేసుకొని, రైతు సమస్యల కోసం పనిచేయాలా రైతులు సంఘటితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షులు విట్టల్ రెడ్డి, జిల్లాఉపాధ్యక్షులు శంకర్, బాసర డివిజన్ గౌరవాధ్యక్షులు హన్మంత్ రెడ్డి, పెద్దకోడప్ గల్ మండల అధ్యక్షులు బస్వారాజ్ దేశాయ్, గ్రామ అధ్యక్షులు కుమార్ సింగ్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు సౌదగర్ గంగారాం, సోసైటీ చైర్మన్ చెన్న రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ కొండ విట్టల్,బీజేపీ మండల అధ్యక్షులు సుభాష్, మండల కార్యదర్శి బోడి రాజు యాదవ్, మండల అన్ని గ్రామాలకి సత్సంగం కమిటీ సభ్యులు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad