నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలో నూతనంగా ఆల్ ఇండియా బంజారా సేవా సన్ మండల కార్యవర్గం బుధవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిందని నియోజకవర్గ ఇన్చార్జ్ అధ్యక్షులు జాదవ్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ మండల యూత్ అధ్యక్షుడుగా జాదవ్ ఉద్ధవ్, జనరల్ సెక్రిరిటీలు గా రాథోడ్ యశ్పాల్ , చవాన్ సుభాష్, ఉపాధ్యాక్షులు గా రాథోడ్ లక్ష్మణ్, రాథోడ్ నారాయణ్ , సోషల్ మీడియా ప్రతినిధిగా రాథోడ్ సునీల్ లను జీల్లా అధ్యక్షుడు సురేందర్ నాయక్ సలహా సూచన మేరకు జుక్కల్ నియోజికవర్గం ఇంచార్జ్ జాదవ్ నామదేవ్,జుక్కల్ మండల్ అధ్యక్షుడు జాదవ్ రాజు,జనరల్ సెక్రూరిటీ చవాన్ వినోద్,ఉపాధ్యక్షులు రాథోడ్ రాజేందర్ మరియు ఆడే ధనాజీ ,హరి జాదవ్ ,చందర్ రాథోడ్ , ఎక్స్ ఆర్మీ ఆనంద్ జాదవ్ సోపాన్ రాథోడ్ ఆద్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్ను కోవడం జరిగింది.
జుక్కల్ ఎస్సైని సన్మానించిన బంజారా సేవాసం కార్యవర్గం.
జుక్కల్ ఎస్సై నవీన్ చంద్రను బుధవారం ఆల్ ఇండియా బంజారా సేవాసం మండల నూతన కార్యవర్గం నాయకులు కలిసి ఎస్సైని ఘనంగా శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.