లేబర్‌కోడ్‌లకు వ్యతిరేకంగా ఆందోళన
కార్మిక వర్గంపై యుద్ధానికి
కార్మిక వర్గ యుద్ధంతో సమాధానం
కేంద్ర కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లేబర్‌కోడ్‌లకు వ్యతిరేకంగా ఫిబ్రవరిలో అఖిల భారత సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కార్మికవర్గంపై యుద్ధానికి కార్మిక వర్గ యుద్ధంతోనే సమాధానం చెబుతామని ఆ సంఘాల నేతలు స్పష్టం చేశారు. సోమవారం నాడిక్కడ కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక సమావేశమైంది. కార్మిక వ్యతిరేక లేబర్‌కోడ్‌లను రద్దు చేసే వరకు దశలవారీ పోరాటాలు కొనసాగించాలని నిర్ణయించింది. కార్యాలయ స్థాయిలో సామూహిక ప్రచారం, నిరసనలను కొనసాగిస్తూ కేంద్ర కార్మిక సంఘాల సమాఖ్యల ఉమ్మడి వేదిక ఫిబ్రవరిలో అఖిల భారత సార్వత్రిక సమ్మెకు దిగనుంది. తదుపరి సమావేశంలో డిసెంబర్ 22న తేదీలను ప్రకటిస్తామని సంఘాల నేతలు తెలిపారు. ఈ సమా వేశంలో సీఐటీయూ నేతలు తపన్‌సేన్, హేమలత, ఎఆర్ సింధు, కెఎన్ ఉమేశ్, సుదీప్ దత్తా, అశోక్ సింగ్ (ఐఎన్‌టీయూసీ), అమర్‌జీత్ కౌర్ (ఏఐటీయూసీ) హర్భజన్ సింగ్ సిద్ధూ (హెచ్‌ఎంఎస్), ఆర్‌కె పరాశర్, చౌరాసియా (ఏఐయూటీయూసీ), రాజీవ్ దిమ్రి (ఏఐసీసీటీయూ), సోనియా జార్జ్ (సెవా), వీస్వామి (ఎల్‌పీఎఫ్), శత్రుజీత్ (యూటీయూసీ) తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరిలో అఖిల భారత సార్వత్రిక సమ్మె
- Advertisement -
- Advertisement -



