నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో ఆది, సోమవారాల్లో ఆలిండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఆదివారంఅక్కడి అసెంబ్లీ భవనంలో సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ముగింపు కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీల స్పీకర్లు, పలువురు డిప్యూటీ స్పీకర్లు, మండలి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు ఇందులో పాల్గొంటారు. రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల స్పీకర్లు శనివారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో పాటు మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు.. ఇటు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తరలివెళ్లారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి కంటి శస్త్ర చికిత్స జరిగినందున ఈ సమావేశాలకు హాజరు కావట్లేదు.
ఇవాళ ఆలిండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES