Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకాంగ్రెస్‌ పాలనలో పథకాలన్నీ బంద్‌

కాంగ్రెస్‌ పాలనలో పథకాలన్నీ బంద్‌

- Advertisement -

– మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కాంగ్రెస్‌ పాలనలో అన్ని పథకాలు బంద్‌ అయ్యాయని మాజీ మంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పథకాలను కాంగ్రెస్‌ సర్కార్‌ అటకెక్కించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో ఊదర గొట్టిన హామీల అమలును గాలికొది లేశారని తెలిపారు. రేవంత్‌ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప కూడా దాటటం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అని విమర్శించారు. పాలన అంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు కాదని హితవు పలికారు. అధికారంలోకొచ్చిన వంద రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభయహస్తం మ్యానిఫెస్టోలో పేర్కొన్నారని గుర్తు చేశారు. గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డీడీ పైసలు కూడా వాపస్‌ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img