నవతెలంగాణ – మిర్యాలగూడ : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువత తరలివెళ్లారు. స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూడు బస్ లలో వెళుతున్న యువతకు జెండా ఊపి ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో 275 వివిధ కంపెనీల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. నియోజవర్గం నుండి వేలాది మంది యువకులు ఈ జాబ్ మేళా కు తరలి వెళ్లారని చెప్పారు. తరలివెళ్లిన నిరుద్యోగ యువతకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఆల్ ది బెస్ట్ : ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



