– ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి
– కళాశాలలో పెరిగిన ఇంటర్ విద్యార్థుల సంఖ్య
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయివేటు పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు అన్ని సదుపాయాలను కల్పిస్తున్నట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కళాశాలలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో అడ్మిషన్లు బాగా పెరిగాయన్నారు. ఈ సంవత్సరం జూనియర్ కళాశాలలో సుమారుగా 60 మందికి పైగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని తెలిపారు.
అదేవిధంగా ఈ సంవత్సరం కళాశాలకు ప్రభుత్వం అన్ని సబ్జెక్టులకు సంబందించిన ఫుల్ టైం లెక్చరర్స్ ను కేటాయించిందన్నారు.ఈ చక్కటి అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాల పదవ తరగతి పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమ్మర్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రైవేట్ కళాశాల కంటే దీటుగా అన్ని సదుపాయాలు కలిపిస్తున్నమని తెలిపారు. కళాశాల అభివృద్ధికి స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఎంతో సహాయ సహకారాలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు మధు కుమార్, వెంకటేష్, గంగారం, మహేందర్, వైష్ణవి, స్వాతి, సుమతి, తదితరులు పాల్గొన్నారు.
ప్రయివేటు కళాశాలలకు ధీటుగా అన్ని సదుపాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES