డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి కృష్ణయ్య
నవతెలంగాణ – వనపర్తి
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి వి రజని ఆదేశాలను సారం శనివారం వనపర్తి జిల్లాలో బిల్డింగ్, కాంట్రాక్ట్, అన్-ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో పనిచేసే శ్రామికులకు చట్టాలపై అవగాహన కల్పించారు. అన్-ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో పనిచేసే కార్మికులు ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవడం వలన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్, విద్యా సహాయం, ప్రసవ సాయం, మరణ సహాయం వంటి పథకాలకు అర్హత పొందడానికి కార్మికుల హక్కుల రక్షణ కనీస వేతనం, సేఫ్టీ నిబంధనలు, లీగల్ హక్కులు పొందడానికి ప్రూఫ్‌గా ఉపయోగపడుతుందని తెలియజేశారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వల్లభ నగర్ పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు జీవిత లక్ష్యాలను నిర్ణయించుకుని వాటిని సాధించాలని అన్నారు. ఉచిత న్యాయ సలహాల కొరకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు బాల బాలికలు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని తెలియజేశారు. ఈ చట్టo ప్రకారం ఎవరైనా వాహనాలు నడిపితే 25 వేల రూపాయల జరిమానా మూడు సంవత్సరాల జైలు శిక్ష తల్లిదండ్రులకు విధించబడుతుంది అని తెలియజేశారు. అదేవిధంగా పిల్లలకు నీతి కథలను బోధించారు. విద్యార్థులు క్రమంగా పుస్తక పఠనం చేయాలని సూచించారు.
అసంఘటిత కార్మికులు అందరూ తప్పనిసరిగా ఈ శ్రమ కార్డును కలిగి ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES