Wednesday, October 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతరగతులకు అనుమతించండి

తరగతులకు అనుమతించండి

- Advertisement -

ఎస్టీ స్టడీ సర్కిల్‌కు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎమ్మార్వో కుల ధ్రువీకరణ పత్రాన్ని కింది స్థాయి అధికారులు తనిఖీ చేయలేదని చెప్పి ఒక ఎస్టీ అభ్యర్థిని యుపీఎస్సీ కోచింగ్‌ తరగతులకు అనుమతించకపోవడంపై హైకోర్టు స్పందించింది. క్షేత్ర స్థాయి తనిఖీలు జరిగేలోగా పిటిషనర్‌ను తరగతులకు అనుమతించాలని ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ స్టడీ సర్కిల్‌ ఫర్‌ ఎస్టీని ఆదేశించింది. నిజామాబాద్‌ జిల్లా నల్లూరు గ్రామస్తుడు కార్తీక్‌ కుమార్‌ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ వేణుగోపాల్‌ ఆదేశాలిచ్చారు. ఎస్టీ సంక్షేమశాఖ వాదనల నిమిత్తం విచారణను 24వ తేదీకి వాయిదా వేశారు.

పీటీఏలపై వివరాలు ఇవ్వండి
తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల్లో పేరంట్‌, టీచర్‌ అసోసియేషన్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారించింది. రాష్ట్ర విద్యా చట్టం ప్రకారం ప్రతి పాఠశాల స్థాయిలో పీటీఏ ఏర్పాటుకు ఆదేశాలివ్వాలంటూ సంగారెడ్డి జిల్లా కంది గ్రామానికి చెందిన మల్లికార్జున్‌ వేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు భాగస్వామ్యం కల్పించేందుకు, పాఠశాల నిర్వహణ, కనీస సౌకర్యాల కల్పన, పర్యవేక్షణకు కమిటీ దోహదపడుతుందని పటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ కౌంటర్‌ నిమిత్తం విచారణ 6 వారాలకు వాయిదా పడింది.

వినతిపత్రంపై చర్యలు తీసుకోండి
హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌పై అందిన వినతిపత్రంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పబ్లిక్‌ స్కూల్‌ను 1994 విద్యాసంస్థల చట్ట నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారో లేదో చెప్పాలంది. పబ్లిక్‌ స్కూల్‌లో అవతవకలపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఏప్రిల్‌ 15న వినతి పత్రం ఇచ్చినప్పటికీ చర్యలు లేవంటూ హైదరాబాద్‌ వాసి రవీందర్‌ వేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఆపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారించింది. పిటిషనర్‌ వినతిపత్రంపై విచారణ జరిపి మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను మూసివేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -