Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసమస్యలపై పోరాటంతో పాటు సమాజాన్నీఅధ్యయనం చేయాలి

సమస్యలపై పోరాటంతో పాటు సమాజాన్నీఅధ్యయనం చేయాలి

- Advertisement -

– ఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. రాములు
– మహబూబ్‌నగర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు ప్రారంభం
నవ తెలంగాణ- మహబూబ్‌ నగర్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఎడ్యుకేషన్‌ పాలసీ విధానానికి వ్యతిరేకంగా పోరాటాలతో పాటు సమాజంలో జరుగుతున్న అంశాలను అధ్యయనం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. రాములు అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బోయపల్లి గేట్‌, రైస్‌మిల్‌ అసోసియేషన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఐదు రోజులపాటు జరగనున్న ఈ తరగతుల ప్రారంభ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అమలవుతున్న న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీకి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఎస్‌ఎఫ్‌ఐ ముందుండాలన్నారు. శాస్త్రీయ విద్యా విధానం కోసం, విద్యార్థుల సమస్యలపై పోరాటం కొనసాగించాలని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. భవిష్యత్తు విద్యార్థి ఉద్యమానికి ఈ క్లాసులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నూతన ఎడ్యుకేషన్‌ పాలసీని అమలు చేసే విధంగా ప్రయత్నిస్తుందన్నారు. భవిష్యత్తులో దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు. కాగా, మొదటి రోజు ”శాస్త్రీయ ఆలోచన” క్లాస్‌ను జన విజ్ఞాన దర్శిని రమేశ్‌ బోధించాడు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ నాయకులు కురుమూర్తి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్‌, ఉపాధ్యక్షులు కిరణ్‌, శ్రీకాంత్‌ వర్మ, ప్రశాంత్‌, గర్ల్స్‌ కన్వీనర్‌ పూజ, మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రశాంత్‌, భరత్‌, ఉపాధ్యక్షులు నందు, వివిధ జిల్లాల విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img