Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్క్రీడలతో ఆరోగ్యంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు..

క్రీడలతో ఆరోగ్యంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు..

- Advertisement -

సర్కిల్ ఇన్స్పెక్టర్ … చంద్రబాబు
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: క్రీడల్లో శిక్షణ పొందిన వారికి మంచి ఆరోగ్యం తో పాటు ప్రభుత్వ అందించే ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్ అవకాశాలు ఉంటాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు అన్నారు. మంగళవారం భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. తెలంగాణ  రాష్ట్ర యువజన మరియు క్రీడల శాఖలు  సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో ఖో -ఖో , వాలి బాల్, కబడ్డీ ,  రన్నింగ్ తదితర క్రీడలపై  8 నుండి 14 సంవత్సరాల వయస్సు గల సుమారు 110 మంది బాలబాలికలకు 41 రోజుల పాటు  ఉచిత శిక్షణ ఇచ్చారు. ఈ క్యాంపులో శిక్షణ పొందిన విద్యార్థులకు , క్రీడాకారులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి రూరల్ ఎస్సై ఎం అనిల్ కుమార్, వేసవి శిక్షణా శిబిరం ఇంచార్జీ పిట్టల అంజయ్య,  గ్రామ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు ఏదునూరి మల్లేశం, యాదాద్రి భువనగిరి జిల్లా ఖో-ఖో ఆర్గనైజర్ సెక్రెటరీ పల్లె రమేష్ రెడ్డి , బోల్లేపల్లి అశోక్, బాతుక అశోక్, పిట్టల శ్రీశైలం, సందీప్, సాయినాథ్, భార్గవి, వర్షిత,  సోహెల్,  గ్రామ యువతీయువకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad