Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1989-90 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 35 సంవత్సరాల తర్వాత ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చదువు చెప్పిన ఉపాధ్యాయులు నరసయ్య, ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి, నాగభూషణం గౌడ్, విటల్ రావు, కాశీనాథ్ శర్మ, రాందాస్ లను శాలువాతో సన్మానించారు. ఆత్మీయ సమ్మేళనానికి 95 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -