Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల బిజీలో ఆలూర్ అధికారులు

ఎన్నికల బిజీలో ఆలూర్ అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ఆలూర్ మండలంలో వేగం పుంజుకున్నాయి. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు ఎన్నికల బిజీలో శుక్రవారం  నిమగ్నమయ్యారు. పోలింగ్ కోసం అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి, స్టేషనరీ సామగ్రి తదితరాలను సక్రమంగా సిద్ధం చేస్తూ కార్యాలయ పరిసరాల్లో చురుగ్గా కదలికలు కనిపించాయి. ఎంపీడీవో, మండల ఎన్నికల అధికారులతో పాటు, పంచాయతీ కార్యదర్శి మొత్తం ఎన్నికల నిర్వహణ పనుల్లో పాల్గొన్నారు. పోలింగ్ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని, ఓటర్లు నిర్బంధంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా బందోబస్తు చర్యలు కూడా చేపట్టామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగాధర్, ఎంపీఓ రాజలింగం, సూపర్వైజర్  శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు  చంద్రశేఖర్, నవీన్, నసీర్, వందన, దినేష్,తరుణం,నాగేంద్ర,కిషోర్, కరాబర్ సంతోష్,సిబ్బంది  కిరణ్ , బలగంగాధర్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -