హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
నవతెలంగాణ-హైదరాబాద్ : సికె నాయుడు (అండర్-23) ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఒడిశాపై హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఒడిశా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకు ఆలౌటవగా.. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులు చేసింది. ఓపెనర్ ఆమన్ రావు (90, 151 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) భారీ అర్థ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. రాఘవ (15), అవనీశ్ (20), మయాంక్ (13), చిరాగ్ యాదవ్ (5), విఘ్నేష్ రెడ్డి (0) విఫలమయ్యారు. 56.3 ఓవర్లలో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 195 పరుగులకు ముగిసింది. ఒడిశా బౌలర్లలో ఆయుశ్ (8/45) ఎనిమిది వికెట్లతో విజృంభించాడు. ఓపెనర్ ఓమ్ (98 నాటౌట్, 169 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్థ సెంచరీతో మెరువగా ఒడిశా రెండో ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 181/2తో ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఒడిశా 145 పరుగుల ముందంజలో కొనసాగుతుంది.