- Advertisement -
వాష్టింగన్ : టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ కృత్రిమ మేధ (ఏఐ) బాధ్యతలను భారతీయుడు అమర్ సుబ్రమణ్యన్‌కు అప్పగించింది. ఆయనను ఆపిల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఇప్పటి వరకు ఈ హోదాలో జాన్ జియానాండ్రియా కొనసా గారు. ఇకపై వైస్ ప్రెసిడెంట్ పదవిలో అమర్ ఏఐ విభాగాన్ని నడిపిస్తారని ఆపిల్ తెలిపింది. అమర్ బెంగళూరు యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. పలు దిగ్గజ టెక్ కంపెనీల్లో పని చేశారు.
- Advertisement -



