Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeమానవియాలకులతో అద్భుత ప్రయోజనాలు..

యాలకులతో అద్భుత ప్రయోజనాలు..

- Advertisement -

మనలో చాలా మంది ఒత్తిడి, చెడు జీవనశైలి కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు నిత్యం యాలకుల పొడిని పాలతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టపడుతుంది. తద్వారా పలు రకాల ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. యాలకులలో కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. తద్వారా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు మీ దరి చేరవు. యాలకుల్లో అనేక పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. యాలకుల్లో మెగ్నీషియం, మాంగనీస్‌, ఫాస్పరస్‌ సమద్దిగా ఉండడం వలన రక్త శుద్ధి జరుగుతుంది. అంతేకాక వీటిని తినడం వల్ల గుండె ధమనులలో అడ్డంకులు ఏర్పడవు. రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు.
యాలకుల్లో విటమిన్‌ సి సమద్దిగా ఉండడం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్‌గా వచ్చే దగ్గు,జలుబు,గొంతు నొప్పి, గొంతు ఇన్‌ఫెక్షన్స్‌ నుంచి రక్షిస్తుంది. యాలకుల్లో ఉండే ఫైబర్‌ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి గ్యాస్‌, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోయేలా చేస్తుంది.
యాలకుల గింజలను చప్పరిస్తూ ఉండటం వల్ల నోట్లో కొన్ని ద్రవాలు ఉత్పత్తి అవుతాయి. . అంతేకాకుండా నోట్లో అలర్జీలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహకరిస్తాయి.యాలకులు విటమిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరానికి కావాల్సిన మోతాదులో అందించి.. శరీరంలోని ప్రీరాడికల్స్‌ని నాశనం చేస్తాయి. అంతేకాదు వీటి వల్ల కిడ్నీ సమస్యలు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రంలో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపులో మంట, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు దూరమవుతాయి. వీటితో పాటు మెటబాలిజం ప్రక్రియను యాలకలు మెరుగు పరుస్తాయి. గ్లాస్‌ వేడిపాలలో కొంత పసుపు, యాలకుల పొడి కలిపి రోజూ రాత్రిపూట పడుకునే ముందు తాగితే తర్వాతి రోజు నీరసం ఉండదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img