- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
భారత రాజ్యాంగ నిర్మాత, అపార విజ్ఞాన సంపన్నుడు, దీనజన ఉద్ధారకుడు, పోరాటమే జీవితంగా మార్చుకున్న త్యాగశీలి, భారతరత్న డా. బాబాసాహెబ్ భీం రావు అంబేద్కర్ అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలోని వాసవి పాఠశాల వద్ద ఉన్న ఆ మహనీయుడి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



