- Advertisement -
చారకొండ నుండి బ్రాహ్మణపల్లి రోడ్ గుంతల మయం
నవతెలంగాణ – చారకొండ
చారకొండ నుండి బ్రాహ్మణపల్లి వరకు రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని బిజెపి నాయకులు చింతపల్లి కిరణ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకి రోడ్డు గుంతల మయంగా, ప్రమాదకరంగా మారిందని అన్నారు రాత్రి వేళలో రోడ్డుపై గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అంబేద్కర్ కాలనీవాసులు రహదారి సరిగా లేకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, కాలనీ అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.
- Advertisement -