ఉత్తరప్రదేశ్‌లో బరితెగించిన దుండగులు..ఎఫ్‌ఐఆర్ నమోదు
యోగి హయాంలో వరుసగా ఐదో దుశ్చర్య
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెగబడుతున్న మూకలు
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మరో అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. వరుసగా ఇది ఐదవ ఘటనగా పోలీసులు శుక్రవారం తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన త్రిపురలో ప్రారంభమైన ఈ విధ్వంస కాండ యూపీకి పాకింది. హిందూత్వమూకలు అంబేద్కర్ విగ్రహాలను కూల్చివేస్తున్న తీరుతో సర్వత్రా భయాందోళన వ్యక్తమవుతోంది. తాజాగా యూపీలోని గద్వార్ ప్రాంతంలోని కొందరు గుర్తు తెలియని దుండ గులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత చెలరేగినందని అన్నారు.
రాంపూర్ అస్లీ గ్రామంలోని గద్వార్-నాగ్రా రహదారి వెంబడి ఏర్పాటు చేసిన విగ్రహం వేలును కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆగ్రహించిన గ్రామస్తు లు నిరసన చేపట్టారు. ఇది ఈప్రాంతంలో అంబేద్క ర్ విగ్రహాల లక్ష్యంగా జరిగిన ఐదవ దాడి ఘటనగా పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) రవి కుమార్, సిటీసర్కిల్ ఆఫీసర్ ఉస్మాన్ ఇతర పోలీస్, పరిపాలనాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించాయని అన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని, రక్షణ సరిహద్దు గోడ, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మెమోరాండంను సమర్పించారని అన్నారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.



