Tuesday, November 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండిజిటల్‌ విశ్వవిద్యాలయంగా అంబేద్కర్‌ వర్సిటీ

డిజిటల్‌ విశ్వవిద్యాలయంగా అంబేద్కర్‌ వర్సిటీ

- Advertisement -

సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ ఏర్పాటు
నేడు కామన్వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌తో అవగాహన ఒప్పందం


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ (ఐడియా)ను స్థాపించడానికి కామన్వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ (సీఒఎల్‌)తో ఒక మైలురాయి అవగాహన ఒప్పందంపై హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఎఒయు) సంతకం చేయనుంది. ఈ అవగాహన ఒప్పందంపై నవంబర్‌ 18న ఉదయం 10.30 గంటలకు బీఆర్‌ఎఒయూ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి, కామన్వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ అధ్యక్షుడు, సీఇవో ప్రొఫెసర్‌ పీటర్‌ స్కాట్‌ అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి సమక్షంలో సంతకం చేయనున్నారు.

ఈ చారిత్రాత్మక భాగస్వామ్యంతో ఓపెన్‌ యూనివర్సిటీ ప్రముఖ డిజిటల్‌ విశ్వవిద్యాలయంగా ఎదగడానికి ముంద డుగు వేస్తోంది. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపర చడానికి ఐడియా అత్యాధునిక డిజిటల్‌ హబ్‌గా పనిచేస్తుంది. దీని ప్రధాన చొరవతో టెక్నాలజీ-ఎనేబుల్డ్‌ లెర్నింగ్‌, కృతిమ మేథస్సులో మైక్రో-క్రెడెన్షియల్స్‌ ద్వారా ఫ్యాకల్టీ అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ బ్లూప్రింట్‌ను రూపొందించడం, వర్చువల్‌ ల్యాబ్‌లకు మద్దతు, ప్రాంతీయ డిజిటల్‌-లెర్నింగ్‌ కన్సార్టియం తదితరాలు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రయత్నాలతో నాణ్యమైన విద్యను అందుబాటులోకి విశ్వవిద్యాలయం తేనుంది. విద్యావేత్తలు, అభ్యాసకులను శక్తివంతం చేయనుంది.

ప్రొఫెసర్‌ పీటర్‌ స్కాట్‌ నవంబర్‌ 18న ఓపెన్‌ యూనివర్సిటీని సందర్శిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. ఓపెన్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత విద్యను అభివృద్ధి చేయడంలో దశాబ్దాల పాటు సుదీర్ఘమైన అనుభవాన్ని ప్రొఫెసర్‌ స్కాట్‌ కలిగి ఉన్నారు. ప్రభుత్వాధినేతలచే స్థాపించబడిన కామన్వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌, ఓపెన్‌ లెర్నింగ్‌, టెక్నాలజీ ద్వారా నాణ్యమైన విద్యను విస్తతం చేయడానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వ సంస్థ. 1987లో కామన్వెల్త్‌ అఫ్‌ లెర్నింగ్‌ను ఏర్పాటు చేశారు. ప్రపంచ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో, ముఖ్యంగా సమగ్రమైన, సమానమైన జీవితకాల అభ్యాస లక్ష్యాలతో ఇది పని చేస్తుంది. డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌ దార్శనికతను ప్రతిబింబిస్తూ, విద్యలో డిజిటల్‌ పరివర్తన, సామాజిక న్యాయం పట్ల ఓపెన్‌ యూనివర్సిటీ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది. సీఒఎల్‌ మద్దతుతో భారతదేశ డిజిటల్‌ విద్యా ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ఓపెన్‌ యూనివర్సిటీ సిద్ధమవుతోందని విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -