నవతెలంగాణ – జన్నారం
బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని శనివారం జన్నారం మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు సిటీమల భరత్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. యువత అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జన్నారం అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు సిటీ మల భరత్ కుమార్, సంఘం నాయకులు బోర్లకుంట ప్రభుదాస్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గుర్రం రాజారాం రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ దు మ్మల రమేష్, ఇందయ్యా, ప్రవీణ్ కుమార్, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.



