డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంబేద్కర్ ఆలోచన తమ ప్రభుత్వానికి మార్గదర్శనమని రాష్ట్ర పాలనకు మార్గదర్శకాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్యుడికి బలమైన ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇచ్చి వారి భవిష్యత్తును వారే రాసుకునే ఏర్పాటు చేసిన గొప్ప మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆలోచనలతోనే రాష్ట్ర పాలన కొనసాగుతున్నదని తెలిపారు. రాష్ట్రానికే కాదు..దేశానికి కూడా అవి మార్గదర్శకమన్నారు. ఆయన పంథానును అనుసరించటమే ఈ దేశానికి భవిష్యత్ అని చెప్పారు. రేపటి భవిష్యత్ కోసం, అసమానతలు లేని సమాజం కోసం, ఈ దేశ ఆర్థిక, సామాజిక, భౌతిక వనరులన్నింటిని సక్రమంగా అందరికీ పంచడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పారు.
బీసీ కమిషన్ కార్యాలయంలో అంబేద్కర్‌కు నివాళి
హైదరాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి కమిషన్ చైర్మెన్ జి నిరంజన్, సబ్యులు రాపనోలు జయప్రకాశ్,తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి తదితరులు పూలమాలేసి నివాళులర్పించారు.బీసీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్ల రక్షణ లేనందున రాష్ట్రంలో సర్వే నిరక్వహించి.. 42శాతం రిజర్వేషన్లకు బిల్లును ఆమోదించినా అమలు చేయని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.రాజ్యాంగంలో సవరణ చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని వారు ఈ సందర్బంగా అభిప్రాయపడ్డారు.
సీపీఐ కార్యాలయంలో..
హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో ఆ పార్టీ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి ఘననివాలులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ, సీనియర్ నాయకులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చాయదేవి, డీహెచ్‌పీఎస్ కార్యదర్శి ఎం అనిల్ కుమార్,సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందగౌడ్, ఏఐవైఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ శ్రీకాంత్, ఏఐటీయూసీ నాయకులు బొడ్డుపల్లి కిషన్ తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.



