Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబులెన్స్ డ్రైవర్ అన్న గుంతల వద్ద జరభద్రం

అంబులెన్స్ డ్రైవర్ అన్న గుంతల వద్ద జరభద్రం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల కేంద్రంలో మెయిన్ రోడ్డు గుండా భారీ గుంతలు పడి మోకాళ్ళ లోతు నీళ్లు నిండి వాహనాలకు ఇబ్బందికరంగా మారింది. ప్రజలు అనారోగ్యాలకు గురి అయితే అత్యవసరంగా అంబులెన్స్ ద్వారా జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించే మార్గం ఇది. మెయిన్ రోడ్డుపై భారీ గుంతలు పడి నీళ్లు నడవరాని స్థితిలో ఉన్న రోడ్డు గురువారం అంబులెన్స్ వెళుతున్న దృశ్యం నవ తెలంగాణ దృశ్య మాలికలో పడింది. అంబులెన్స్ వెళ్తున్న దృశ్యం చూస్తుంటే అంబులెన్స్ డ్రైవర్ అన్న గుంతల వద్ద జర భద్రం అన్నట్టుగా కనిపించింది.

ఎందుకంటే అత్యవసరానికి ఈ గుంతల మార్గం ఇబ్బందికరంగా ఉండడంతో అంబులెన్స్ డ్రైవర్లు స్పీడు పోవాల్సిన దానికి గుంతల వద్ద జర భద్రంగా నడపవలసిన దుస్థితి. ఈ రహదారి ఏండ్ల తరబడి వర్షాకాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ రహదారి అభివృద్ధి పట్ల గ్రామస్తుల్లో చలనం రాకపోవడం ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం డోంగ్లి మండల కేంద్రం రహదారి ప్రభుత్వ అభివృద్ధికి చెడ్డపేరే తెస్తుంది. లక్షలు కోట్లు వెచ్చించి రహదారులు అభివృద్ధి పరుస్తుంటే డోంగ్లి మండల కేంద్రంలో మాత్రం ఏళ్ల తరబడి మోకాళ్ళ లోతు గుంతలు పడ్డ అది బాగు కాకపోవడం డోంగ్లి మండల కేంద్రం ప్రజా ప్రతినిధులు ఈ రహదారి గురించి పట్టించుకోవడంలేదనే వాదనలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. గురువారం అత్యవసరమైన అంబులెన్స్ గుంతల మయం నుండి వెళ్తుంటే అంబులెన్స్లో తీసుకువెళ్లే రోగులకు గాని గర్భవతులకు గాని ఆందోళన కలిగించే విధంగా ఉంది ఇలాంటి ఇబ్బందికరమైన రహదారిని గ్రామస్తులు స్పందించాలని రోడ్డు బాగు కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఈ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -