Sunday, October 12, 2025
E-PAPER
Homeమహబూబ్ నగర్గ్రైన్ మిషన్‌ను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్‌ రాంపురం శివ రెడ్డి

గ్రైన్ మిషన్‌ను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్‌ రాంపురం శివ రెడ్డి

- Advertisement -


నవ తెలంగాణ- నారాయణపేట : రైతుల శ్రేయస్సు కోసం ఆటోమేటిక్‌ గా వడ్లు శుభ్రపరిచే గ్రైన్‌ మిషను శనివారము ఏఎంసీ చైర్మన్‌ రాంపురం శివ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్‌ మాట్లాడుతూ ఆటోమేటిక్‌ గా వడ్లు శుభ్రపరిచే గ్రైన్‌ మిషన్‌ సింగల్‌ ఫేజ్‌ కరెంట్‌ ద్వారా పని చేయునని అన్నారు. ఈ మెషిన్‌ కు ఉన్న పైప్‌ ను ధాన్యం కుప్పలో వడ్లు, జొన్నలు, మక్కా జొన్న ఉంచుతే ఎలాంటి హమాలీలు అవసరం లేకుండా ఆటోమేటిక్‌ గా దాన్యమును మెషిన్‌ తీసికొని జల్లడ మరియు హై స్పీడ్‌ ఫ్యాన్‌ ద్వారా శుబ్రపరిచి తాలు, మట్టి పెడ్డలు, దుమ్ము ఇతర వ్యర్థాలు శుబ్రపర్చి అట్టి ధాన్యాన్ని నేరుగా సంచులో లేదా ట్రాక్టర్‌ ట్రాలీ లో నింపకోవచ్చు నని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ కోనంగిరి హనుమంతు, డైరెక్టర్లు తాహేరు హుసేన్‌, బోయ శరన్నప్ప, జి. వెంకటయ్య, రాజారెడ్డి, చిన్న నరసప్ప, కే. శివకుమార్‌, వ్యాపార సంఘం అధ్యక్షులు సంగు మంగల్గి, వ్యాపారస్తులు, మార్కెట్‌ సిబ్బంది, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -