Wednesday, January 7, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ అమెరికా ప్రపంచ శాంతిని కాలరాసే కుట్ర చేస్తోంది

 అమెరికా ప్రపంచ శాంతిని కాలరాసే కుట్ర చేస్తోంది

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
సార్వభౌమ దేశమైన వెనిజులా పై అమెరికా దాడిని,అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను కిడ్నాప్ చేయడాన్ని, ఖండిస్తూ సీపీఐ(ఎం) అనుబంధ ప్రజా సంఘాల ( వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం,సిఐటియు) ఆధ్వర్యంలో జన్నారం మండల పొనకల్ గ్రామ సుందరయ్య కాలనీలో నల్లజండాలతో నిరసన తెలుపనైనది. ఈ సందర్భంగా  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి  కనికారం అశోక్  మాట్లాడుతూ.. అమెరికా ప్రపంచవ్యాప్తంగా శాంతిని నాశనం చేస్తుందన్నారు. వెనుజులాలో ప్రజల చేత ఎన్నికైన నేత మధురోను అమెరికా నిర్బంధించటం అమానుషమని అన్నారు. ఇది ప్రజాస్వామ్యం పైన జాతీయ సార్వభౌమత్వం పైన అంతర్జాతీయ చట్టాల పైన జరిగిన తీవ్ర దాడిగా పరిగణించవలసి ఉందని అన్నారు.

వెనిజులా లోని అపార చమురు నిల్వలు ఖనిజ సంపదను కబళించాలని అమెరికా కుట్రలో భాగమని ఇది పూర్తిగా సామ్రాజ్యవాద దోపిడీ చర్యా అని పేర్కొన్నారు. పలు దేశాలు అమెరికా చర్యను తీవ్రంగా ఖండించినాయి.మన భారత్ మౌనంగా ఉండకూడదు,అని మన ప్రధాని అమెరికా అక్రమ చర్యలను తక్షణమే ఖండించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జన్నారం మండల అధ్యక్షుడు కొండగుర్ల లింగన్న, సిఐటియు కన్వీనర్ అంబటి లక్ష్మెన్, సీనియర్ నాయకులు కే. బుచ్చయ్య,వ్య. కా. స. నాయకులు ఎం. జయ, భీంబాయి, ఓ. వనిత, స్వప్న, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -