- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో (WHO) నుంచి యూఎస్ అధికారికంగా వైదొలిగింది. కొవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని అమెరికా తెలిపింది. ఇక నుంచి పరిమిత పరిధి మేరకు ఆ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు యూఎస్ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధ్యక్షుడు ట్రంప్ పలు సందర్భాల్లో ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే.
- Advertisement -



