Tuesday, January 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమెరికా దురాక్రమణలను ఆపాలి 

అమెరికా దురాక్రమణలను ఆపాలి 

- Advertisement -

మిర్యాలగూడలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన 
నవతెలంగాణ- మిర్యాలగూడ 

వెనిజులా పై అమెరికా చేస్తున్న దురాక్రమనను ఆపాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం సాగర్ రోడ్డులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్లజెండాలతో నిరసన తెలిపారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెనిజుల దేశంలో అధికార మార్పు తెచ్చేందుకు ఆ దేశ అధ్యక్షులు మధురో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా ప్రభుత్వం కుటిలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రపంచ శాంతి కామకుడిగా గొప్పలు జరుపుకుంటున్న డోనాల్డ్ ట్రంప్ పక్క దేశాలపై బాంబు దాడులకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం దురాక్రమలను దేశ పౌరులు ఖండించాలని పిలుపునిచ్చారు.

వెలుజులలో ఉన్న చమురును తమ ఆధీనంలోకి తీసుకోవాలని ట్రంపు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వెలుజుల చుట్టూ తన సైనిక నావిక దళాలను అమెరికా మోహరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమార్థ గోళంలో అమెరికా ప్రాంతాన్ని తమ నియంత్రలోకి తెచ్చుకోవాలని కంపు ఉన్నారని విమర్శించారు. ఈ చర్యలను పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. వెలుజులా నికరాగువ, క్యూబా దేశాలకు వ్యతిరేకంగా అమెరికా దాడులను ప్రయత్నిస్తుందని చెప్పారు. అమెరికా దురాక్రమనను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు బి ఎం నాయుడు, మంద రాజు, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కోడి రెక్క మల్లయ్య, బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పాషా, గోవర్ధన్ రెడ్డి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -