సెన్సెక్స్ 320 పాయింట్ల పతనం
వెనిజులాపై దాడితో ఇన్వెస్టర్లలో ఆందోళన
నాలుగో రోజూ రూపాయి క్షీణత
ముంబయి : ట్రంప్ చర్యలు దలాల్ స్ట్రీట్‌ను బెంబేలెత్తించాయి. వెనిజులాపై అమెరికా అనుహ్యా దాడితో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. మరోవైపు భారత్‌పై మరింత టారిఫ్‌లను పెంచుతామని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించడంతో మదుపర్లను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా ఐటి, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 322 పాయింట్లు లేదా 0.38 శాతం పతనమై 85,439.62కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 78.25 పాయింట్లు లేదా 0.3 శాతం నష్టంతో 26,250 వద్ద ముగిసింది.
మార్కెట్లు ఆరంభంలో కాసేపు స్వల్ప లాభాల్లో సాగినప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్-30లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, టిసిఎస్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మరోవైపు భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్‌యుఎల్, టాటా స్టీల్, అల్ట్రాటెక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఎక్కువ లాభాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.16 శాతం నష్టపోగా.. స్మాల్ క్యాప్ 0.53 శాతం పెరిగింది. ఐటి, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1 శాతం చొప్పున అధికంగా నష్టపోయి మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి.
మళ్లీ 90 ఎగువకు రూపాయి పతనం
వరుసగా నాలుగో రోజూ రూపాయి విలువ పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోల్చితే సోమవారం మరో ఎనిమిది పైసలు తగ్గి 90.28కి పరిమితమయ్యింది. ఉదయం ఫారిన్ ఎక్సేంజీ మార్కెట్‌లో 90.21 వద్ద తెరుచుకున్న రూపాయి విలువ 90.50 కనిష్ట స్థాయిని తాకింది. నాలుగు సెషన్లలో 53 పైసలు నష్టపోయింది. వెనిజులాలో అమెరికా సైనిక జోక్యంతో భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొనడం రూపాయిని ఒత్తిడికి గురి చేసిందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో రూపాయి విలువ 90.60కు పడిపోయే అవకాశం ఉందని మిరే అసెట్ షేర్ ఖాన్ కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి అంచనా వేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 60.76 వద్ద నమోదయ్యింది.
దలాల్ స్ట్రీట్‌కు అమెరికా భయాలు
- Advertisement -
- Advertisement -



