Thursday, January 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనిజులాకు అమెరికా కొత్త బెదిరింపులు

వెనిజులాకు అమెరికా కొత్త బెదిరింపులు

- Advertisement -

వాషింగ్టన్‌ : వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను నిర్భంధించి, ఆపహరించిన తరువాత కూడా ఆ దేశంపై అమెరికా బెదిరింపులను ఆపడం లేదు. వెనిజులాలోని నూతన నాయకత్వం తమ ఆదేశాల ప్రకారం నడుచుకోకపోతే ఆ దేశంపై కొత్తగా సైనిక చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా తాజాగా హెచ్చరించింది. ఈ హెచ్చరికలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేశారు. మదురో నిర్భంధం తరువాత కూడా అవసరమైతే వెనిజులాలో అదనపు బలగాలను ప్రయోగించడానికి ట్రంప్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వెనిజులా కొత్త నాయకత్వం తమ వినడం కోసం వినియోగించే ఇతర పద్ధతులు విఫలమైతే బలప్రయోగానికి అమెరికా సిద్ధంగా ఉందని రూబియో స్పష్టం చేశారు. అలాగే, ప్రస్తుతం వెనిజులాపై అమెరికా యుద్ధం చేయడం లేదని, అక్కడ అమెరికా సైనికులు లేరని అన్నారు. వెనిజులాలో శాంతిభద్రతలకు సహాయం చేయడానికి చేసిన ఆపరేషన్‌గా తమ దాడిని రూబియో సమర్ధించుకున్నారు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో సంబంధాలను సాధారణ పరిస్థితికి తీసుకొనిరావడానికి అమెరికా అధికారులు కృషి చేస్తున్నారని, అలాగే, ట్రంప్‌ డిమాండ్లను ఆమోదించడం తప్ప రోడ్రిగ్జ్‌కు వేరే ఇతర మార్గంలేదని రూబియో హెచ్చరింపు ధోరణిలో తెలిపారు. మదురోకు పట్టిన గతి గురించి రోడ్రిగ్జ్‌కు బాగా తెలుసునని, అమెరికా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి ఆమె సహకరిస్తారని నమ్ముతున్నట్లు రూబియో చెప్పారు. అమెరికా డిమాండ్లల్లో వెనిజులా ఇంధన రంగాన్ని అమెరికా కంపెనీలకు అప్పగించడం, వెనిజులాకు వచ్చిన చమురు ఆదాయాన్ని అమెరికన్‌ వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించడం, క్యూబాకు సబ్సిడీతో కూడిన చమురు ఎగుమతులను నిలిపి వేయడం..వంటివి ఉన్నాయని రూబియో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -