Thursday, December 11, 2025
E-PAPER
Homeజాతీయంఅమిత్‌ షా ఆందోళనకు గురయ్యారు : రాహుల్‌ గాంధీ

అమిత్‌ షా ఆందోళనకు గురయ్యారు : రాహుల్‌ గాంధీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పార్లమెంటులో బుధవారం లోక్‌సభలో ఎస్‌ఐఆర్‌పై జరిగిన చర్చల్లో అమిత్‌షా ఆందోళనకు గురయ్యారు. అని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. నిన్న పార్లమెంటులో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సమయంలో అమిత్‌ షా వాడిన భాష సరిగ్గా లేదు. ఆయన చేతులు వణికాయి. ఆయన పార్లమెంటులో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. ఇదంతా దేశం మొత్తం చూసింది.

అని ఆయన పార్లమెంట్‌ హౌస్‌లో విలేకరులతో అన్నారు. నేను అడిగిన ప్రశ్నలకు అమిత్‌ షా సమాధానమివ్వలేదు. వాటికి రుజువు చూపించలేదు. పార్లమెంటులో నిర్వహించే మీడియా సమావేశంలో అమిత్‌షాని నాతో చర్చకు రావాలని సవాల్‌ విసిరాను. దానికి ఆయన ఏం స్పందించలేదు అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓటు చోరీకి పాల్పడుతున్నారని, ఇది రాజద్రోహమని పార్లమెంటులో అమిత్‌షా ఎస్‌ఐఆర్‌పై మాట్లాడేటప్పుడు రాహుల్‌ అడ్డుకున్నారు. ఈ చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -