నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 21న ప్రారంభమైన వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ దన్‌కర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పదవీకాలం రెండేండ్లు ఉన్నా అనూహ్యంగా రాజీనామా సమర్పించారు. ఈ హఠాత్తూ పరిణామంపై దేశంలో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రతిపక్షాలకు అనుకూలంగా వ్యవహరించారని నెపంతో ఆయన వేటు వేశారని మోడీ ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అంతేకాకుండా ఆయన రాజీనామా తర్వాత ఏ కార్యక్రమంలో కూడా కన్పించలేదు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఆయనను హౌస్ అరెస్ట్ చేసిందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. జగదీప్ దన్‌కర్‌కు కనీసం వీడ్కొలు సమావేశం లేకుండా అవమానించారని మండిపడ్డాయి. ఈక్రమంలో జగదీప్ దన్‌కర్ రాజీనామాపై కేంద్ర హోంమంత్రి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ముఖాముఖి చర్చలో కీలక వ్యాఖ్యలు చేశారు.ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ దన్‌ఖడ్ ఆనారోగ్య కారణాలతో రాజీనామా చేశారని చెప్పారు.
‘దన్‌ఖడ్ సాహబ్ రాజీనామా లేఖ స్వయంగా స్పష్టంగా ఉంది. ఆయన తన రాజీనామాకు ఆరోగ్య కారణాలను పేర్కొన్నారు. తన మంచి పదవీకాలం కోసం ప్రధానమంత్రి, ఇతర మంత్రులు, ప్రభుత్వ సభ్యుల పట్ల ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా వ్యక్తం చేశారు.” కొంతమంది ప్రతిపక్ష నాయకులు చెప్పినట్లుగా జగదీప్ దన్‌కర్ “గృహ నిర్బంధంలో” ఉండటం గురించి అడిగినప్పుడు, అవాస్తవాలతో కూడిన ప్రతిపక్షాల ప్రకటనలపై మాత్రమే ఆధారపడకూడదని, మాజీ ఉపాధ్యక్షుడి రాజీనామాపై గొడవ చేయవద్దని హెచ్చరించారు. అని షా అన్నారు.