- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇటీవల ఫ్యాన్స్ అత్యుత్సాహంతో సెలబ్రిటీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిధి అగర్వాల్, సమంత, విజయ్, తనూజ ఇలా పలువురు ఫ్యాన్స్ వలన చాలా ఇబ్బందికి గురయ్యారు. ఇక ఇప్పుడు ఇదే జాబితాలో అమితాబ్ బచ్చన్ కూడా చేరారు. సూరత్ ఎయిర్ పోర్ట్‌లో ఆయనని చూసేందుకు భారీ ఎత్తున ఫ్యాన్స్ తరలి రాగా, ఆయన తన కారు వద్దకు చేరుకోవడం చాలా కష్టంగా మారింది. అభిమానుల తాకిడి ఒకేసారి ఎక్కువ కావడంతో విమానాశ్రయం ద్వారం వద్ద ఉన్న గ్లాస్ పగిలిపోయింది. ఆ సమయంలో అమితాబ్ కాస్త దూరంగా ఉండడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు.
- Advertisement -



