నవతెలంగాణ – రెంజల్
అమ్మ మాట అంగన్వాడి బాట అనే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలం లోని సాతాపూర్ 1,3, అంగన్వాడీ కేంద్రాలలో ఈ కార్యక్రమాలల నిర్వహించడం జరిగిందని ఐసిడిఎస్ సూపర్వైజర్ సౌజన్య పేర్కొన్నారు. జూన్ 10 నుంచి 17 వరకు అంగన్వాడి వారోత్సవంలో భాగంగా మండలంలో ప్రతి అంగన్వాడి కేంద్రాల్లో ఈ వారోత్సవాల నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రెండున్నర సంవత్సరాల లోపు బాల బాలికలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని ఆమె అంగన్వాడి కార్యకర్తలకు సూచించారు. ఇంటింటికి అంగన్వాడి కార్యకర్తలు వెళ్లి చిన్నారుల పేర్లను నమోదు చేసుకోవాలని, వారికి పౌష్టికాహారంతో పాటు, ఆటపాటలు, నాణ్యమైన విద్యను జరుగుతుందని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అమ్మ మాట అంగన్వాడి బాట అవగాహన ర్యాలీతోపాటు, అక్షరభ్యాసం చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు సరస్వతి, జమున, అంగన్వాడి టీచర్ సావిత్రి, ఆశా వర్కర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రెంజల్ మండల పరిధిలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES