Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడే

మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడే

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు 
బుధవారం నవతెలంగాణ నమస్తే తెలంగాణ దినపత్రిక వరంగల్ యూనిట్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టిడబ్ల్యూజేఎఫ్ హనుమకొండ జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ వలి ఒక ప్రకటనలో తెలిపారు. మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యం పై దాడి జరిగినట్లే అని ఆవేదన వ్యక్తం చేశారు.పత్రికా వర్గాలపై దాడులు అసహనానికి నిదర్శనం! అని మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీ అయినా,ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియాపై బెదిరింపులకు దిగటం మంచిపద్దతి కాదని అన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై వార్తలు రాసే స్వేఛ్చ పత్రికలకు ఉంటుందని, పేపర్లలో తమకు వ్యతిరేక వార్తలు వస్తే, వాటికి ఖండనలు ఇవ్వటం, వివరణలు ఇవ్వటం చేయాలి కానీ బెదిరింపులకు పాల్పడటం, భౌతిక దాడులకు దిగటానికి ప్రజాస్వామ్యంలో చోటులేదన్నారు. భావప్రకటనా స్వేఛ్చ పై దాడి సరికాదని, తక్షణమే పత్రికా కార్యాలయంపై దాడికి దిగిన వారిని అరెస్టు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, దాడికి ఉసిగొల్పిన వారిని గుర్తించి చర్యలు చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -