- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
నూతనంగా ప్రారంభించే ఇంజనీరింగ్ కళాశాలను తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్న తెలంగాణ సౌత్ క్యాంపస్ లో ఏర్పాటు చేయాలని పూర్వ జేఏసీ అధ్యక్షులు సత్యం తెలిపారు. శుక్రవారం అయన విలేకరులతో మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు సౌత్ క్యాంపస్ లో ఏర్పాటు చేయాలని తెలంగాణ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరి రావు, రిజిస్టర్ యాదగిరిని కోరారు. అనువైన స్థలం ఉన్న క్యాంపస్ లో ఏర్పాటు చేయడానికి జిల్లాలోని ప్రతి విద్యార్థి సంఘ నాయకులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శ్రీనివాస్, హరికృష్ణ, యోగేష్, పవన్, రాజు, పాండు, తదితరులు ఉన్నారు.
- Advertisement -